హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలవరం మండలంలో మరో పంచాయతీ ఏకగ్రీవం

ELR: పోలవరం మండలం గడ్డపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కెచ్చెల చిన్నారెడ్డి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.