హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుండుపల్లిలో విద్యుత్ తీగల చోరీ.. రైతు ఆవేదన

అన్నమయ్య: సుండుపల్లి మండలం బండకాడ ఈడిగపల్లి సమీపంలో మోటార్ల విద్యుత్ తీగలు చోరీకి గురయ్యాయి. తన పొలంలో ఇప్పటివరకు మూడుసార్లు తీగలు చోరీ అయ్యాయని రైతు నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ దొంగతనాలతో సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. పోలీసులు స్పందించి నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.