హైదరాబాద్: 28°C
వ్యాపారం

బంగారం ధర ఎందుకు తగ్గుతుందంటే?

అంతర్జాతీయ పరిణామాల వల్లే బంగారం ధర పతనమవుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం డాలర్‌ విలువ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్లపై ఎక్కువ రిటర్న్స్ వస్తుండటంతో ఇన్వెస్టర్లు వాటిపైకి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. అలాగే అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలను మించి నమోదవడం, డిసెంబరులో అక్కడ ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచొచ్చనే అంచనాలు పసిడి ధర పతనానికి కారణమవుతున్నాయి.