హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం!

నిర్మల్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంటికి విజిలెన్స్, పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. పోలీసుల రాకతో ఆమె అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సీఎంఆర్ కుంభకోణం కేసులో రూ.40.96 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో గత ఆగస్టులో రేఖానాయక్‌పై కేసు నమోదు కాగా.. తాజాగా ఆమె అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.