WGL: నల్లబెల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకకు వెళ్లి తిరిగొస్తున్న ఇద్దరు స్నేహితులు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భూపాలపల్లికి చెందిన మల్లికార్జున్ (35) తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. రాజేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను స్థానికులు నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. మల్లికార్జున్ మృతి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరి దుర్మరణం


