SRD: ఖేడ్ పట్టణ పరిధి మంగళపేటకు చెందిన విశ్రాంత డిప్యూటీ కమిషనర్ (CT) జుకంటి వీరబసప్ప (90) అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన కుమారుడు జస్టిస్ అనిల్ కుమార్ ప్రస్తుతం TG హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. వీరబసప్ప పార్థివ దేహాన్ని మంగళపేటలోని ఆయన స్వగృహానికి తరలించగా, శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
విశ్రాంత డిప్యూటీ కమిషనర్ కన్నుమూత


