MDK: తూప్రాన్ DSP నరేందర్ గౌడ్ గురువారం మనోహరాబాద్ PSను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని క్రైమ్ ఫైల్స్, కేసు డైరీలు, రిజిస్టర్లు, సిబ్బంది కిట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, చోరీ సొత్తును రికవరీ చేయాలని ఆదేశించారు. డయల్-112 కాల్స్‌కు తక్షణమే స్పందిస్తూ, రౌడీ షీటర్లపై నిఘా ఉంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
తెలంగాణ
'పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి'


