హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత

KNR: వీణవంక మండలం కిష్టంపేట శివారులో గురువారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. మల్లారెడ్డిపల్లి వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న కుమార్, రాకేశ్‌కు చెందిన రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.