హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోరీకి గురైన ట్రాక్టర్ స్వాధీనం

KNR: వీణవంక మండలం చల్లూరులో ఇంటి ముందు పార్కింగ్ చేసిన ట్రాక్టర్‌ను గురువారం గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మానకొండూరు మండలానికి చెందిన వెంకటేశ్ చోరీ చేసినట్లు గుర్తించి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.