హైదరాబాద్: 28°C
వ్యాపారం

జేపీ మోర్గాన్‌, వీసా, మాస్టర్‌కార్డులపై సైబర్‌ దాడులు!

జేపీ మోర్గాన్‌ చేజ్‌, వీసా, మాస్టర్‌కార్డులను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో హ్యాకర్లు కస్టమర్ల డేటాను చోరీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే తమ పేమెంట్‌ వ్యవస్థలకు ఎలాంటి ముప్పు లేదని మూడు సంస్థలు స్పష్టం చేశాయి. థర్డ్‌ పార్టీ సంస్థల ద్వారా మార్కెటింగ్‌ డేటా చోరీకి గురైనట్లు జేపీ మోర్గాన్‌ తెలిపింది.