GDWL: రాజోలి మండల కేంద్రంలో కస్తూర్భాకు వెళ్లే రహదారిలో సీసీ రోడ్డు నిర్మించారు. ఇరువైపులా ఎర్రమట్టి వేయడం మరిచారు. తద్వారా అనేక మంది ప్రమాదానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఉన్నారని రోడ్డు వేయడం లేదా అంటూ స్ధానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీ రహదారికి ఇరువైపులా ఎర్రమట్టి వేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
వ్యాపారం
రోడ్డు వేశారు.. ఇరువైపులా మట్టి వేయడం మరిచారు..!


