హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,570 తగ్గి రూ.1,30,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,350 తగ్గి రూ.1,19,800ఉంది. అటు కిలో వెండి ధర కూడా రూ.5,000 తగ్గి రూ.1,80,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.