హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ వాహనం ద్వారా ఇందిరమ్మ బీమాపై అవగాహన

VKB: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాండూరు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 15వ వార్డు పాత తాండూరులో శుక్రవారం చెత్త సేకరణ వాహనానికి ఏర్పాటు చేసిన మైక్ ద్వారా బీమా పథకానికి సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేస్తున్నారు.