NGKL: తిమ్మాజిపేట మండలంలోని బావాజిపల్లిలో పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. గ్రామానికి చెందిన పాపగారి మహేశ్ (21) పొలానికి వెళ్లి పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. తండ్రి బంగారయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
తెలంగాణ
పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య


