హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 23న నిజామాబాద్‌కు నితిన్ నబిన్

NZB: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ నెల 23న నిజామాబాద్ నగరానికి రానున్నారు. గాంధీచౌక్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు నిర్వహించే మహా పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం చౌరస్తాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పర్యటన ఏర్పాట్లను ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యవేక్షించనున్నారు. జూమ్ సమావేశం నిర్వహించి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.