హైదరాబాద్: 28°C
తెలంగాణ

గట్టమ్మ ఆలయంలో అరుదైన కొబ్బరికాయ

ములుగు జిల్లాలోని గట్టమ్మ తల్లి ఆలయంలో రెండు గదులుగా ఉన్న అరుదైన కొబ్బరికాయ భక్తులను ఆశ్చర్యపరిచింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు కొబ్బరికాయ కొట్టగా, లోపల పెంకు గోడలా ఏర్పడి రెండు వేర్వేరు గదులుగా కనిపించింది. రెండు భాగాల్లోనూ కొబ్బరి గుజ్జు ఉండటంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. కొందరు దీన్ని అమ్మవారి మహిమగా భావించారు.