BHPL: రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పోచంపల్లిలో మహాముత్తారం ఎస్సై జి. రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 35 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 400 లీటర్ల తెల్ల పానకాన్ని ధ్వంసం చేసి, ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
35 లీటర్ల గుడుంబా స్వాధీనం


