హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల వదంతులు నమ్మవద్దు: ప్రిన్సిపల్

ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో వివిధ అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలు, నిరాధారమైన వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రిన్సిపల్ తాటి శంకర్ తెలిపారు. ఈ పోస్టులు డబ్బులకు అమ్ముడుపోతున్నాయంటూ జరుగుతున్న అసత్య ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.