BHPL: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుంచి ఈ నెల 24 వరకు కార్తీక పంచరత్నాల ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ మోహన్ శర్మ, ఈవో మహేశ్ తెలిపారు. 23న అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ, 24న రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణం నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకాలు చేస్తారు.
తెలంగాణ
కాళేశ్వరంలో నేటి నుంచి పంచరత్నాల వేడుకలు


