BHNG: రాజాపేటలోని శ్రీ రామకృష్ణ సాయి మందిరం సభ్యులు శుక్రవారం ఏకాదశి సందర్భంగా నగర సంకీర్తన నిర్వహించారు. మర్కూక్ పాండురంగ ఆశ్రమ శతకోటి నామ సంకీర్తనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. సాయి మందిరం నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు భక్తులు భజనలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నామస్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
రాజాపేటలో నగర సంకీర్తన కార్యక్రమం


