హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన.. డ్రైవర్ తొలగింపు!

HYD: ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించిన ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ బి.సూర్యను TGSRTC విధుల నుంచి తొలగించింది. ఈ నెల 12న హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. విచారణ అనంతరం రాష్ట్రంలోని ఏ డిపోలోనూ అతడికి విధులు కేటాయించరాదని అధికారులు ఆదేశించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని RTC స్పష్టం చేసింది.