హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామను కరవు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ

జనగామ జిల్లాను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించి ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్. రాజారెడ్డి గురువారం ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలోని జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గుతున్నాయని, భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని అన్నారు. కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.