హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్

BHPL: గంజాయి వినియోగంపై అనుమానంతో తొమ్మిది మందికి భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. వారికి డీ-అడిక్షన్ కేంద్రం ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.