PDPL: పెద్దపల్లి నియోజకవర్గానికి రెండు కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. ఓదెల మండలం కొలనూరు, పెద్దపల్లి మండలం తురకల మద్దికుంటలో నూతన సంఘాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. దీంతో ఆయా గ్రామాల రైతులకు వ్యవసాయ రుణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ
రెండు PACSలు మంజూరు


