హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: KUలో విద్యార్థుల అస్వస్థతపై PDSU నిరసన

WGL: కాకతీయ యూనివర్సిటీలో పౌష్టికాహార లోపంతో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనను నిరసిస్తూ పీడీఎస్‌యూ కేయూ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి వర్సిటీ మొదటి గేటు వద్ద ఆందోళన చేపట్టారు. రాత్రి 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిరసన కొనసాగించారు. హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు.