హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి'

ASF: జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 100 శాతం మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన యూడైస్ శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పెంచి, యూడైస్లో పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు.