BDK: పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం మణుగూరు ఆర్టీసీ డిపో ప్రత్యేక రవాణా సదుపాయం కల్పిస్తోంది. కార్తీక మాసం, అయ్యప్ప యాత్రలను పురస్కరించుకుని పంచారామాలు, అన్నవరం, అరుణాచలం, శబరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ కే. శ్యాంసుందర్ గురువారం తెలిపారు. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
పుణ్యక్షేత్రాల యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు


