హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇథనాల్ పరిశ్రమపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ

NLG: దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో ప్రతిపాదించిన ఇథనాల్ పరిశ్రమపై నేడు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. రూ. 750 కోట్లతో 108 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పరిశ్రమతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తుండగా, పర్యావరణం, ప్రజారోగ్యంపై ప్రభావం ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.