హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంను కలిసిన కాంగ్రెస్ గిరిజన నేత

సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ నేత ధరావత్ తిరుపతి నాయక్ (డి.టి. నాయక్) మర్యాదపూర్వకంగా కలిశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ధికి అవసరమైన పనులు, ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటాన్ని బహూకరించారు.