హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా భక్తులకు కనకదుర్గమ్మ గాజుల ప్రసాదం

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మకు అలంకరించిన గాజులను గురువారం మహిళా భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. సౌభాగ్యానికి ప్రతీకగా భావించే అమ్మవారి గాజులను మహిళలు భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు.