హైదరాబాద్: 28°C
తెలంగాణ

వంగూరులో భారీ వాహనాల రాకపోకలతో దుమ్ము

NGKL: వంగూరు మండల కేంద్రంలో భారీ వాహనాల రాకపోకల కారణంగా రహదారుల వెంట ఉన్న దుకాణాల్లోకి పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి చేరుతుండటంతో వ్యాపారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న దుమ్ము గాలిలోకి ఎగిసి దుకాణాల్లోకి చేరుతోంది. ఈ దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.