అధికారిక పత్రాల్లో దత్తత తీసుకున్న పిల్లలను 'దత్తపుత్రుడు' లేదా 'దత్తపుత్రిక' అని పేర్కొనే పద్ధతిని తక్షణమే తొలగించాలని కేరళం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దత్తత తీసుకున్న పిల్లలను కేవలం తల్లిదండ్రుల 'కుమారుడు' లేదా 'కుమార్తె' గానే గుర్తించాలని సూచించింది. దత్తత తీసుకున్న తేదీ నుంచి ఆ చిన్నారి అన్ని విధాలా ఆ తల్లిదండ్రుల సొంత బిడ్డగానే పరిగణించబడతారని తెలిపింది.
వార్తలు
ప్రభుత్వానికి కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు


