రోడ్ కనెక్టివిటీలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్‌గా ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణంలో రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలిపారు. రహదారులు మంచిగా ఉంటే భారీగా పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో చాలా రికార్డులు సాధించామన్నారు.
వార్తలు
రహదారుల నిర్మాణంలో చాలా రికార్డులు సాధించాం: కేంద్రమంత్రి


