హైదరాబాద్: 28°C
వార్తలు

ECకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీ ముస్తఫాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల పేర్లను తొలగించేందుకు తప్పుడు ఫారం-7 దరఖాస్తులు దాఖలయ్యాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఓటర్లు మరణించారని, వేరే ప్రాంతానికి వెళ్లిపోయారని ఫారం-7కు దరఖాస్తు చేశారని.. కానీ ఇప్పటికీ చాలా మంది సజీవంగానే ఉన్నారని, అదే చిరునామాలో ఉన్నారని కథనాలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై క్షుణ్ణంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది.