హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయులది తినితిరిగే తత్వం కాదు: మోదీ

భారతీయులది తినితిరిగే తత్వం కాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలోనే పొదుపు మంత్రం ఇమిడి ఉందన్నారు. పొదుపు, ఆర్థిక క్రమశిక్షణపై ప్రజలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర మంత్రులకు ప్రధాని సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తే ప్రజలు మళ్లీ పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు.