హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

విజయనగరం: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 24న నామినేషన్ల పరిశీలన, 27న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.