హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో తుఫాన్ హెచ్చరిక!

శ్రీకాకుళం: అక్వాన్ తుఫాన్ ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నర్సాపురం-పూరీ మధ్య తీరం దాటవచ్చని, గంటకు 90-100 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 19, 20 తేదీల్లో అతిభారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.