హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ అభ్యర్థి దేవికి TDP బి -ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే

CTR: నగరి మండలం ఎంపీపీ అభ్యర్థిగా ఎస్.దేవి పేరును తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీర కుప్పం సెగ్మెంట్ ఎంపీటీసీగా ఆమె గెలుపొందారు. నేడు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్న ఎన్నికల్లో ఆమెను సభ్యులంతా కలిసి ఎంపీపీగా ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష ఆమెకు తెలుగుదేశం పార్టీ బి -ఫామ్‌ను అందజేశారు.