WG: తణుకు మండలం మండపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బోడపాటి వీర్రాజు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. గ్రామదేవత యల్లారమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనుచరులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రంలో అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయన వెంట జనసేన నేత గుడివాడ రామచంద్రరావు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
మండపాక సర్పంచ్ అభ్యర్థిగా బోడపాటి వీర్రాజు నామినేషన్


