హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మసాగర్ లో 20 లక్షల చేప పిల్లలు విడుదల

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని బ్రహ్మసాగర్ జలాశయంలో గురువారం చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) మరియు ప్రభుత్వ పథకాల ద్వారా 20 లక్షల చేప పిల్లల విడుదల చేశారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధితో పాటు జలాశయంలో మత్స్య సంపదను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.