హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

25న ఓవర్సీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్

శ్రీకాకుళం: నిరుద్యోగ యువతీ, యువకులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 25వ తేదీన విశాఖపట్నంలో ఓవర్సీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సుధ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో 'స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్' ఈ రిక్రూట్మెంట్ జరుగుతుందన్నారు.