ASR: అరకు వేలిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఏపీ కాంగ్రెస్ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి ఆధ్వర్యంలో నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, ఆమె ఆశయ సాధన కోసం ఐక్యంగా పనిచేయాలని చిన్నస్వామి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అరకు వాలీలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు


