హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజువాకలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి

విశాఖ: గాజువాక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పీసీసీ అధికార ప్రతినిధి, ఏపీ స్టేట్ ఇంటక్ ఉపాధ్యక్షుడు జెర్రిపోతుల ముత్యాలు పూలమాల వేసి నివాళులర్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి నగర అభివృద్ధికి ఇందిరాగాంధీ విశేష కృషి చేశారని కొనియాడారు.