హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోదరికి తలకొరివి పెట్టిన మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి అంత్యక్రియలు జరిగాయి. బుధవారం అనారోగ్యంతో ఆమె మృతి చెందగా, గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. మచిలీపట్నంలోని సర్కిల్‌పేటలో ఉన్న స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. మంత్రి కొల్లు రవీంద్ర తన సోదరి భౌతికకాయానికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.