వెలింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ప్లేయర్ హెన్రీ నికోల్స్ (113*) సెంచరీ చేశాడు. దీంతో ఒకే వేదికపై అత్యధిక సెంచరీలు చేసిన మూడో కివీస్ ఆటగాడిగా నిలిచాడు. వెలింగ్టన్‌లో మార్టిన్ క్రో (5), కేన్ విలియమ్సన్ (5) సరసన చేరాడు. వెలింగ్టన్ మైదానంలో 15 ఇన్నింగ్స్‌ల్లో నికోల్స్ ఐదు సెంచరీలు సాధించాడు. ఇక, హామిల్టన్ మైదానంలో విలియమ్సన్ (7), రాస్ టేలర్ (6) ఎక్కువ సెంచరీలు చేశారు.
క్రీడలు
NZ vs IND: రికార్డు సృష్టించిన హెన్రీ నికోల్స్


