హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి రోజు కోసమే జట్టు ఎంపిక ఉండదు: కోచ్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకి సిరాజ్‌ను ఎంపికచేయకపోవడంపై వస్తున్న విమర్శలపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు స్పందించాడు. అతడిని ఎంపిక చేయకపోవడం తప్పుడు నిర్ణయం కాదన్నాడు. టీమ్ సెలక్షన్ అనేది మ్యాచ్ తొలిరోజు కోసం జరగదని తెలిపాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా అన్నిరోజుల కోసం ఎంపిక చేస్తారని పేర్కొన్నాడు. కాగా, సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై క్రికెట్ దిగ్గజం గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.