హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలోనే అతి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం

అన్నమయ్య: జిల్లాలోనే అతి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని సుదుం మండల కేంద్రంలోని గార్గేయ నది ఒడ్డున ఏర్పాటు చేశారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో మురుగన్ విగ్రహాన్ని నిర్మించారు. ఈ నిలువెత్తు విగ్రహం జిల్లాకే తలమానికంగా నిలిచింది. కార్తీక మాసం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.