NTR: రెడ్డిగూడెం మండల అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి రంగాపురంలోని ఓ మామిడి తోటలోకి ప్రవేశించింది. అక్కడ కొద్దిసేపు సంచరించిన అనంతరం దిశ మార్చుకుని తిరిగి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని మైలవరం సీఐ కిషోర్ బాబు సూచించారు. అటవీ ప్రాంతాలకు వెళ్లేటపుడు జాగ్రత్తలు పాటించాన్నారు.
ఆంధ్రప్రదేశ్
దిశ మార్చుకొన్న పెద్దపులి


