హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోస్టాఫీసులో ఉచితంగా బాల ఆధార్ నమోదు

కోనసీమ: మండపేట పట్టణంలోని పోస్టాఫీసులో ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా బాల ఆధార్ నమోదు చేస్తున్నారు. అలాగే కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్, మొబైల్ నంబర్ మార్పు తదితర సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని పోస్టాఫీస్ నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.