హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

GNTR: తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. బోసురోడ్డులోని చిట్టి ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఇందిరా గాంధీ విగ్రహానికి పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేశారని అన్నారు.